News November 26, 2025

వరంగల్: కోతుల పంచాయితీ తీరిస్తేనే.. గ్రామ పంచాయతీకి!

image

ఉమ్మడి వరంగల్‌లో కోతుల బెడద తీవ్రమవడంతో గ్రామ పంచాయితీ ఎన్నికలకే కొత్త పేరొచ్చింది. కోతుల పంచాయితీ తీరిస్తేనే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడటం, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలే ముందుకు రావడంతో, కోతుల సమస్యను ఎవరు పరిష్కరిస్తారో వారికే ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారు. పంటలు నాశనం, ఇళ్లలోకి చొరబాటు, కోతుల దాడులతో గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయి.

Similar News

News November 26, 2025

HNK: ప్రయాణికుల సలహాల కోసం ‘డయల్ యువర్ డీఎం’

image

ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు వారి సూచనల కోసం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. తమ డిపో పరిధిలోని ప్రజలు ఈ నెల 27, గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 8977781103 నెంబరుకు ఫోన్ చేసి, డిపో అభివృద్ధికి విలువైన సలహాలను అందించాలని ఆయన కోరారు.

News November 26, 2025

ASF జిల్లాలో డిసెంబర్ 1 నుంచి పరీక్షలు

image

ASF జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు 2024-25 బ్యాచ్ అభ్యర్థులకు, గత బ్యాచ్‌లో అనుతీర్ణులైన అభ్యర్థులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

News November 26, 2025

నల్గొండ: పౌరులందరి హక్కులకు రాజ్యాంగం రక్ష: ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ

image

భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరి హక్కులకు రక్షణ కల్పిస్తుందని ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి అన్నారు. నల్గొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక హక్కులు, బాధ్యతలు ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకొని, వాటిని ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.