News April 9, 2025

వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

image

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News February 21, 2026

22న గన్నవరంలో జిల్లాస్థాయి జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సీనియర్ స్త్రీ, పురుషుల టెన్నిస్ బాల్ క్రికెట్ జట్లను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారిని వచ్చే నెల 7న సంతనూతలపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి నరేంద్ర బాబు తెలిపారు. మరిన్ని వివరాలకు 94418 12694ను సంప్రదించాలన్నారు.

News February 21, 2026

KMR: పార్టీ నాయకులు, కార్యకర్తలు రావొద్దు: ఎమ్మెల్యే

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. అయితే ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులను శిశు మందిర్ వద్దకు శనివారం 10గంటలకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకులు సైతం సవాలు స్వీకరించారు. కానీ వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రావొద్దని తానే తేల్చుకుంటానని ఎమ్మెల్యే పార్టీ శ్రేణులను కోరారు.

News February 21, 2026

ప్రీ మెచ్యూర్ బేబీలకు ఈ సమస్యల ముప్పు

image

నెలలు నిండక ముందే పుట్టినవారు చాలా సున్నితంగా ఉంటారు. కంటికి రెప్పలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ముందే పుట్టడం వల్ల వీరికి కంటి సమస్యలు, వినికిడి లోపం, శ్వాస, మెదడు సమస్యలు, గుండె జబ్బులు, నరాలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. పుట్టినప్పుడు వారి అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.