News April 9, 2025

వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

image

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News April 18, 2025

నారాయణపేటలో MURDER.. జైలు శిక్ష

image

ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నారాయణపేట జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పునిచ్చారని ఎస్పీ తెలిపారు. కోర్టు లిజనింగ్ ఆఫీసర్ కృష్ణయ్య గౌడ్ తెలిపిన వివరాలు.. గోపి అనే వ్యక్తి మల్లేశ్‌ను హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో నేరస్థుడు గోపికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  

News April 18, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 18, శుక్రవారం)

image

ఫజర్: తెల్లవారుజామున 4.44 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.33 గంటలకు
ఇష: రాత్రి 7.47 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 18, 2025

నారాయణపేట: ‘నా భర్త చనిపోయాడు.. నన్ను ఆదుకోండి మేడం’ 

image

మద్దూరు మండలంలో జరిగిన భూభారతి సభలో ఓమేశ్వరి అనే మహిళ తన సమస్యను కలెక్టర్‌కి వివరించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. మహిళ మాట్లాడుతూ.. తన భర్త కాశప్ప చనిపోయి సంవత్సరం అవుతోందని, కానీ తనకి ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వం పథకం నుంచి లబ్ధి చేకూరలేదన్నారు. వితంతు పెన్షన్ కూడా రావడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తన గోడు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం సహాయం చేయాలని కలెక్టర్‌ని కోరారు. 

error: Content is protected !!