News December 31, 2025
వరంగల్ క్రీడాకారుడిని ప్రశంసించిన మోదీ

వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన వరంగల్ క్రీడాకారుడు అర్జున్ ఎరిగైసిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. దోహాలో జరిగిన ఈ పోటీల్లో అర్జున్ కనబరిచిన ప్రతిభ అద్భుతమని, ఆయన సాధించిన విజయాలు దేశంలోని యువతకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని బుధవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 3, 2026
ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

☆ ఖమ్మం నగరంలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
☆ సత్తుపల్లి (మం) రామానగరంలో నేడు రక్తదాన శిబిరం
☆ జిల్లాలో కొనసాగుతున్న యూరియా పంపిణీ పక్రియ
☆ జిల్లాలో పర్యటించనున్న కలెక్టర్ అనుదీప్
☆ ఖమ్మంలో నేటి నుంచి టెట్ పరీక్షలు
☆ ఖమ్మం రూరల్ మారెమ్మ తల్లి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు
☆ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
News January 3, 2026
10 నిమిషాల డెలివరీలపై బ్లింకిట్ ఫౌండర్ ఏమన్నారంటే?

క్విక్ కామర్స్‌లో 10 నిమిషాల డెలివరీపై వస్తోన్న విమర్శలపై బ్లింకిట్ (జొమాటో) ఫౌండర్ దీపిందర్ గోయల్ స్పందించారు. ‘స్టోర్లకు దగ్గరగా ఉన్న కస్టమర్లకే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ ప్లేస్ అయిన 2.5 నిమిషాల్లో ప్యాకింగ్ పూర్తవుతుంది. డిస్టెన్స్ 2 KM మాత్రమే ఉంటుంది కాబట్టి 8 నిమిషాల టైమ్ ఉంటుంది. సగటు వేగం గంటకు 15 KM మాత్రమే. దీనివల్ల డెలివరీ ఏజెంట్లకు రిస్క్ ఏం ఉండదు’ అని ట్వీట్ చేశారు.
News January 3, 2026
KMM: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఆస్పత్రులు సీజ్: డీఎంహెచ్‌ఓ

ఖమ్మం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆస్పత్రులను సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామారావు హెచ్చరించారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లల సంరక్షణ అందరి బాధ్యతని, చట్టవిరుద్ధంగా భ్రూణ హత్యలకు ప్రోత్సహిస్తే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. వైద్యులు, యజమానులు నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు.


