News March 26, 2024
వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7170
మూడు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పున: ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్‌కు భారీగా పత్తి తరలివచ్చింది. అయితే గత వారంతో పోలిస్తే ఈరోజు పత్తి ధర భారీగా తగ్గింది. గత వారం క్వింటా పత్తి రూ.7300 కి పైగా పలకగా.. ఈరోజు రూ.7170కి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 9, 2025
అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
మహబూబాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులతో కలిసి విద్యాశాఖ, రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు ప్రతి సబ్జెక్టులో అర్థమయ్యే రీతిలో అత్యుత్తమ బోధనలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలన్నారు.
News January 9, 2025
పదవీ విరమణ చేసిన హోంగార్డ్‌ను సత్కరించిన WGL సీపీ
సుధీర్ఘ కాలం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డ్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన హోం గార్డ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గురువారం క్యాంప్ కార్యక్రమంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్‌లో ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని హోం గార్డ్‌కు సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్ కుమార్, ఏసీపీ నాగయ్య, ఆర్.ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News January 9, 2025
మహబూబాబాద్: ABSF ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా జయంతి
మహబూబాబాద్లో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా జయంతి వేడుక నిర్వహించారు. అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగుర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఫాతిమా జయంతిని అధికారింగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంజీవరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.