News February 5, 2025
వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News February 5, 2025
ఏలూరులో ఏసీబీ దాడులు..ఫుడ్ సేఫ్టీ అధికారిని అరెస్టు
ఏలూరు నగరంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం..ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్య రెడ్డి బుధవారం రూ.15,000 లంచం తీసుకుంటుండగా రైడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు. అధికారితో పాటు ఆఫీసు సబార్డినేట్ పుల్లారావును అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వాధికారుల చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్షమించేది లేదని హెచ్చరించారు. ఏసీబీ డీఎస్పీ, అధికారులు ఉన్నారు.
News February 5, 2025
నెట్‌ఫ్లిక్స్‌లోనూ పుష్ప-2 హవా
థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప-2 సినిమా ఓటీటీలోనూ దుమారం రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 4రోజుల్లోనే 5.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. 7 దేశాల్లో వ్యూయర్‌షిప్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషేతర కేటగిరీల్లో రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో ఈ మూవీ రూ.1850 కోట్లపై చిలుకు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
News February 5, 2025
చర్చనీయాంశంగా మారిన దేవినేని ఉమ ట్వీట్
ట్విటర్, వేదికగా రేషన్ మాఫియాపై మాజీమంత్రి దేవినేని ఉమ సంచల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, విజయవాడ సిటీ పోలీస్, ఎన్టీఆర్ కలెక్టర్‌ని ట్యాగ్ చేశారు. వైసీపీ హయాంలో దోపిడీ చాలదన్నట్లు ఇంకా మైలవరంలో రేషన్ దోపిడీ అంటూ పోస్ట్ చేశారు. మాఫియా ఆట కట్టిస్తామని అన్నారు. 2 రోజుల క్రితం ఓ వాహనంలో పోలీసుల తనిఖీలో మైలవరంలో పట్టుబడిన 22 క్వింటాళ్ల రేషన్ బియ్యం వేదికగా రాజకీయం ముదురుతోంది.