News February 25, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6900

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర రూ.10 పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,890 ధర పలకగా.. నేడు రూ.6900 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రావడం లేదని రైతులు నిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Similar News

News February 25, 2025

మద్దతిచ్చినందుకు థాంక్యూ ట్రంప్: వివేక్ రామస్వామి

image

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికన్ హిందూ, రిపబ్లికన్‌ నేత వివేక్ రామస్వామి థాంక్స్ చెప్పారు. ఓహైయో గవర్నర్ అభ్యర్థిగా ఎండార్స్ చేయడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తామంతా ఆయనకు అండగా ఉంటామని, ఓహైయోను మళ్లీ గొప్పగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘వివేక్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయనెంతో స్పెషల్, యంగ్, స్మార్ట్’ అంటూ ట్రంప్ ట్వీట్ చేయడం తెలిసిందే.

News February 25, 2025

చంద్రబాబు ఇంటిపై దాడి కేసు నిందితులకు ముందస్తు బెయిల్

image

AP: YCP హయాంలో చంద్రబాబు ఇల్లు, TDP ఆఫీసుపై జరిగిన దాడి కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా 20 మందికి ఊరట దక్కింది. అయితే విచారణకు సహకరించాలని, దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. విచారణను 3 ఏళ్లు తాత్సారం చేశారని వ్యాఖ్యానించింది. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని, అధికారం పోయాక కోర్టుకు వచ్చారని ప్రభుత్వం వాదనలు వినిపించింది.

News February 25, 2025

వరంగల్: రెండు రోజులు మద్యం అమ్మకాలు బంద్

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి(మంగళవారం) నుంచి గురువారం వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 4 గంటల నుంచి 27 తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవని అధికారులు తెలిపారు. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, మూసివేయాలని కలెక్టర్ సత్య శారద దేవి ఆదేశించారు.

error: Content is protected !!