News March 26, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 7010

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030 పలకగా.. మంగళవారం రూ.7,045కి చేరింది. నేడు భారీగా తగ్గి రూ.7,010కి పడిపోయింది. ధర రూ.7,500 కి పైగా పలికేలా అధికారులు వ్యాపారులు చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Similar News

News March 29, 2025

ఆ నీటిని వాడొద్దు.. చాలా ప్రమాదకరం!

image

ఎండాకాలం వచ్చేసింది. నీటి ఎద్దడి ప్రారంభమైంది. దీంతో చాలా చోట్ల, ముఖ్యంగా నగరాల్లో డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసి అవే వాడుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘క్రిములు పుట్టేది, కీటకాలు గుడ్లు పెట్టేది నిల్వ నీటిలోనే. రోజుల తరబడి స్టోర్ చేసిన నీటిని వాడితే మలేరియా, చర్మవ్యాధులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఏరోజు నీరు ఆరోజు వాడుకోవడం మంచిది’ అని పేర్కొన్నారు.

News March 29, 2025

వనపర్తి: రాజీవ్ యువ వికాసానికి అర్హతలు ఇవే.!

image

✓ గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.2 వార్షికాదాయం ఉన్నవారు అర్హులు.✓ దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్ కార్డు లేకుంటే తాజా ఆదాయ ధ్రువపత్రం వివరాలను ఇవ్వాలి. ✓ వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయసు 21-55 సంవత్సరాల మధ్య ఉండాలి. ✓ వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు 21-60 ఏళ్ల మధ్య ఉండాలి.✓ ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత.

News March 29, 2025

పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నటి

image

నటి అభినయ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌తో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్టు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. సినీ అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. పుట్టుకతో చెవిటి, మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!