News November 11, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,830

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర నేడు రూ.6,830 అయింది. రూ.7 వేలకు పైగా ధర పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో తేమలేని పత్తి మార్కెట్‌కు తీసుకురావాలని సూచిస్తున్నారు.

Similar News

News November 11, 2025

మొక్కల్లో నత్రజని లోపం.. ఇలా గుర్తిద్దాం

image

మొక్క ఎదుగుదల, పూత, పిందె రావడం, కాయ పరిమాణం ఎదుగుదలలో నత్రజని కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల మొక్క పెరుగుదల, పూత, కాపు కుంటుపడుతుంది. ఆకులు చిన్నగా మారతాయి. ముదిరిన ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి, పొట్టిగా, పీలగా కనిపిస్తాయి. పంట దిగుబడి తగ్గుతుంది. ఒకవేళ నత్రజని అధికమైతే కాండం, ఆకులు ముదురాకు పచ్చగా మారి చీడపీడల ఉద్ధృతి పెరుగుతుంది. పూత, కాపు ఆలస్యమవుతుంది.

News November 11, 2025

కల్తీ నెయ్యి కేసులో విచారణకు ధర్మారెడ్డి

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మాజీ టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. అలిపిరి సమీపంలోని సీబీఐ సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన భద్రతా వలయంలో లోపలికి చేరుకున్నారు. సిట్ డీఐజీ మురళీ రాంభా ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. రెండు రోజులు పాటు విచారణ జరగనుంది.

News November 11, 2025

కృష్ణా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

తాడేపల్లి పరిధి సీతానగరంలోని కృష్ణానదిలో మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30నుండి 34 ఏళ్ల మద్యలో ఉంటుందని మృతుడు నలుపు రంగు ఫ్యాంటు, నీలం రంగు చొక్కా ధరించినట్లు చెప్పారు. మృతుని వివరాలు తెలిస్తే 86888 31364 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.