News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News November 15, 2025
MBNR: ఆ పదవి కోసం.. ఆశావాహులు ఎదురుచూపులు!

మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త కాంగ్రెస్ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఎనిమిది నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ పదవి కోసం సీనియర్ నాయకులు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్నిక జరగకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తుందోనని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News November 15, 2025
రంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జీ.ఆశన్న సూచించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 2025-26 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలనన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు.
News November 15, 2025
ఖమ్మం: వ్యక్తి మృతి.. అకౌంట్ నుంచి డబ్బు మాయం

చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి ఫోన్‌పే ద్వారా పలు దఫాలుగా నగదు కాజేసిన ఘటన సత్తుపల్లిలో జరిగింది. హనుమాన్ నగర్‌కు చెందిన ఆలేటి ప్రసాద్ 3 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రసాద్ ఫోన్ నుంచి ఫోన్ పే ద్వారా కొందరు దుండగులు రూ.3 లక్షలు కాజేశారు. కుటుంబ సభ్యులకు బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయగా.. అకౌంట్‌లో ఉన్న నగదు మొత్తం బదిలీ అయిందని చెప్పడంతో షాక్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.


