News February 3, 2025

వరంగల్‌: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

image

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.

Similar News

News July 9, 2025

వరంగల్: రేపు భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలు

image

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి మాత శాకాంబరీ ఉత్సవాలు గురువారం జరగనున్నాయి. 14 రోజుల పాటు భద్రకాళి మాత వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చింది. చివరిరోజైన గురువారం వివిధ రకాల కూరగాయలతో శాకాంబరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News July 9, 2025

లక్ష్మీ బ్యారేజీలో భారీగా వరద ప్రవాహం

image

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో బుధవారం సాయంత్రం గోదావరికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీలో సాయంత్రం 6 గంటలకు 2,41,530 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గోదావరికి వరద ప్రవాహం బాగా పెరుగుతోంది.

News July 9, 2025

KNR: SRR (అటనామస్) కళాశాల డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల

image

కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ (అటనామస్) కళాశాల డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, SU కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి.సురేశ్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీనివాస్, అధ్యాపకుల బృందంతో కలిసి బుధవారం విడుదల చేశారు. 6వ సెమిస్టర్‌తోపాటు డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులైన వారు 79%, 4వ సెమిస్టర్‌లో 38%, 2వ సెమిస్టర్‌లో 30% ఉత్తీర్ణత సాధించారు.