News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి
గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News February 3, 2025
జనగామ: 5న కిసాన్ మేళా వ్యవసాయ ప్రదర్శన
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 5న రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వన్ భాషా షేక్ తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కిసాన్ మేళాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నూతన వ్యవసాయ పరిజ్ఞానాన్ని ప్రదర్శన రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
News February 3, 2025
NZB: వ్యభిచార గృహంపై దాడి
నిజామాబాద్ నగరంలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి చేసినట్లు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారుతి నగర్‌లోని ఓ ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలితో పాటు ముగ్గురు బాధిత మహిళలను, ఒక విటుడిని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. 4 సెల్ ఫోన్లు, రూ.3660 నగదును స్వాధీనం చేసుకుని వారిని రూరల్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
News February 3, 2025
‘తీన్మార్ మల్లన్న ఏ పార్టీ?’
TG: కాంగ్రెస్ MLC నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న) ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతగా ఉండి సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఏంటని విస్తు పోతున్నారు. దీంతో ఆయన ఏ పార్టీ నేత అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.