News March 18, 2024

వరంగల్: గుండెపోటుతో వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన BRS గ్రామ కమిటీ నాయకుడు జనగాం నారాయణ గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పని నిమిత్తం బయటకు వస్తున్న నారాయణ రోడ్డుపై అకస్మాతుగా కుప్పకులాడు. అది గమనించిన గ్రామస్థులు అతనికి ఫిట్స్ వచ్చిందేమొనని తాళాల గుత్తి అతని చేతిలో పెట్టారు. కాగా అప్పటికే నారాయణ మృతిచెందినట్లు వారు గుర్తించారు.

Similar News

News July 1, 2024

వరంగల్: ఈరోజు పత్తి ధర రూ.7,160

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలిరాగా.. ధర మాత్రం గత వారంలాగే రూ.7,160 పలికింది. పత్తి ధర పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంన్నది.

News July 1, 2024

MHBD: ఓ వ్యక్తి వేధింపులు.. భార్య మృతి, భర్త సీరియస్

image

ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన MHBD జిల్లా నెల్లికుదురు మం.లో ఆదివారం జరిగింది. SI క్రాంతికిరణ్ ప్రకారం.. పెద్దతండాకు చెందిన నీలమ్మను అదే గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. నీలమ్మ భర్త భద్రు అవమానానికి గురై పురుగు మందు తాగగా.. నీలమ్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. నీలమ్మ మృతి చెందగా.. భద్రు చికిత్స పొందుతున్నాడు.

News July 1, 2024

వరంగల్ కాంగ్రెస్‌‌లో కలహాలు?

image

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కలహాలు పెరిగాయనే విమర్శలొస్తున్నాయి. శనివారం CM రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కనీస సమాచారం లేదని పలువురు ముఖ్యనాయకులు వాపోయారు. ఇదిలా ఉండగా CM పర్యటనలో NSPT MLA దొంతి మాధవరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల నియోజకవర్గంలో సైతం ఫ్లెక్సీలు, ఇతర అంశాలపై వాగ్వాదాలు జరుగుతుండగా.. వర్ధన్నపేటలో నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.