News September 12, 2025
వరంగల్: గ్రామాల్లో బొడ్డెమ్మ పండగ ప్రారంభం..!

జిల్లాలోని ఆయా గ్రామాల్లో బొడ్డెమ్మ పండగ ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. బొడ్డెమ్మను పుట్ట మట్టితో అందంగా పేర్చి చెక్క పీటపై కలశం పెట్టీ పసుపు గౌరమ్మను ఉంచుతారు. ఇలా రోజు కాలనీలో ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి తొమ్మిది రోజులపాటు ఆటపాటలతో బొడ్డెమ్మను ఆడుతారు. అమావాస్య ముందు రోజు చెరువులో స్థానిక కుంటల్లో బావుల్లో నిమజ్జనం చేస్తారు. మరుసటి రోజు నుంచే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.
Similar News
News April 12, 2026
కామారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత ఎలా ఉందంటే?

కామారెడ్డి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోందని ప్లానింగ్ సొసైటీ నివేదిక వెల్లడించింది. పిట్లం మండలంలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పలుచోట్ల 40 డిగ్రీలు దాటింది. వర్షపాతం ఎక్కడా నమోదు కాలేదు. ఎండల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News April 12, 2026
రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో డెడ్ బాడీ!

రాజమండ్రి రైల్వే స్టేషన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై శనివారం సుమారు 64 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతుడు గోధుమ రంగు టీషర్ట్, డార్క్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ‘మావూరి అప్పారావు, తండ్రి వీరన్న’ అని ఉన్న ఆసుపత్రి చీటి లభించింది. ఆచూకీ తెలిసిన వారు 9440779249 నంబరును సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ వై.వి. రమణ కోరారు.
News April 12, 2026
ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే..?

వేసవిలో ఉష్ణోగ్రత 35-40 డిగ్రీల వరకు ఉంటే బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 40-45 డిగ్రీలకు చేరుకుంటే ప్రమాద స్థాయి పెరుగుతుంది. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 45 డిగ్రీలు దాటితే వడదెబ్బతో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. పగటి వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అత్యవసరం అయితే గొడుగు లేదా టోపీ వాడాలి. కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి.


