News December 23, 2025

వరంగల్: గ్రామ సారథులకు సమస్యల స్వాగతం!

image

ఏడాదిన్నర కాలంగా క్షేత్ర స్థాయి పరిపాలన లేక బోసిపోయిన పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,682 గ్రామాల్లో సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. వారికి గ్రామాల్లో సమస్యల స్వాగతం పలుకుతున్నాయి. ఇన్నాళ్లు పంచాయతీ కార్యదర్శులు నెట్టుకొచ్చారు. ప్రధానంగా సైడ్ డ్రైనేజ్ లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, నల్లా నీటి సరఫరా వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Similar News

News December 31, 2025

ఏటీఎంల భద్రతపై నిజామాబాద్ సీపీ సమీక్ష

image

జిల్లాలో ATM దొంగతనాల నేపథ్యంలో సీపీ సాయి చైతన్య బ్యాంక్ మేనేజర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటీఎంలో 30 రోజుల బ్యాకప్‌తో కూడిన సీసీ కెమెరాలు, అలారం, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి సమన్వయంతో నేరాలను అరికట్టాలని సూచించారు.

News December 31, 2025

వరంగల్: ఎస్సై సుధాకర్‌కు ఇండియన్ పోలీస్ మహోన్నత సేవా పతకం

image

వరంగల్ టీజీ ట్రాన్స్‌కోలో ఎస్సైగా పనిచేస్తున్న కనుకుంట్ల సుధాకర్‌కు కేంద్ర హోంశాఖ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ పోలీస్ మహోన్నత సేవా పతకం ప్రకటించింది. హన్మకొండ జులైవాడకు చెందిన సుధాకర్ 1984లో సివిల్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో విశిష్ట సేవలందించారు. ఆయన ఈ పతకాన్ని వచ్చే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అందుకోనున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనను అభినందించారు.

News December 31, 2025

కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్‌న్యూస్

image

‘X’లో క్వాలిటీ ఒరిజినల్ కంటెంట్ పొందడానికి క్రియేటర్లకు ఇచ్చే పేమెంట్స్ పెంచాలన్న ప్రపోజల్‌పై మస్క్ పాజిటివ్‌గా స్పందించారు. ఒరిజినల్ కంటెంట్‌ క్రియేట్ చేసే వారికి చెల్లించే మొత్తాన్ని భారీగా పెంచనున్నట్టు ప్రకటించారు. అయితే కంటెంట్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పారదర్శకంగా, కచ్చితంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చెల్లింపుల్లో యూట్యూబ్ అద్భుతంగా ఉందని అంగీకరించారు.