News April 23, 2025
వరంగల్: గ్రేట్.. ఒకే ఏడాదిలో 11 మందికి ఆర్మీలో జాబ్స్

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని గిరిజన సంక్షేమ సైనిక్ స్కూల్ నుంచి ఒకే ఏడాదిలో 11 మంది అగ్నివీర్‌లో ఉద్యోగాలు సాధించారు. గత నెలలో ఇదే పాఠశాలకు చెందిన 8 మందికి జాబ్స్ వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన రెండో విడత ఫలితాల్లో మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వ కొలువులు వచ్చాయి. ఉపాధ్యాయుల అంకితభావంతోనే ఈ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు.
Similar News
News April 23, 2025
వరంగల్: మూడు రోజులుగా స్థిరంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మూడు రోజులుగా తటస్థంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. మంగళవారం అదే ధర పలికింది. బుధవారం సైతం అదే రూ. 7560 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
News April 23, 2025
కామారెడ్డి: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో బిక్కనూర్‌కి చెందిన పూజ (18) సూసైడ్ చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటోంది. పూజ మృతితో బిక్కనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 23, 2025
బాపట్ల : ర్యాంకింగ్‌లో మెరుగు.. ఉత్తీర్ణతా శాతంలో తరుగు

ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాలలో బాపట్ల విద్యార్థులు సత్తాచాటారు. గతేడాది 88.19 పాస్ పర్సెంటేజ్‌తో జిల్లా 14 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పాస్ పర్సంటేజీ తగ్గింది. 83.96 శాతంతో 12 వస్థానంలో నిలిచింది.