News April 16, 2025

వరంగల్: చాక్లెట్ కోసం వెళ్లి అనంత లోకాలకు..

image

చెన్నారావుపేట మం. పుల్లయ్యబోడు తండాలో మంగళవారం <<16107593>>టిప్పర్ ఢీకొని<<>> రెండో తరగతి విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన వెంకన్న-జ్యోతికి కూతురు, కొడుకు. అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన కొడుకు అనిల్(8) చాక్లెట్ కొనుక్కోవడానికి షాప్‌కు వెళ్లాడు. నెక్కొండ నుంచి వస్తున్న టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News December 19, 2025

అమరావతి పెట్టుబడులపై మలేషియా బృందంతో చర్చలు

image

రాజధాని అమరావతిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ శుక్రవారం మలేషియా బృందంతో సమావేశమయ్యారు. రాయపూడిలోని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణ పురోగతిని, ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలను వివరించారు. 2026 జనవరి ప్రథమార్థంలో అమరావతిలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిపారు.

News December 19, 2025

నల్గొండ: విషాదం.. అమ్మాయి కోసం చనిపోయాడు..!

image

తాను ప్రేమించిన యువతి దూరమవుతోందనే బాధతో ఉరేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో జరిగింది. ఏఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాలు.. వెలిమినేడు పరిధిలోని దశమి ల్యాబ్స్‌లో ఝార్ఖండ్ వాసి సుధీర్ ఓర్వాన్(22) పని చేస్తూ లేబర్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయి తనకు దూరమవుతోందని క్వార్టర్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో బ్లాంకెట్‌తో ఉరేసుకుని చనిపోయాడు. కేసు నమోదైంది.

News December 19, 2025

KNR: రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ తప్పనిసరి

image

కరీంనగర్ జిల్లాలోని రేషన్ కార్డుదారులు వంద శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి సూచించారు. జిల్లాలో మొత్తం 3,17,748 రేషన్ కార్డుల్లో 9,45,605 మంది సభ్యులు ఉండగా, ఇప్పటివరకు 7,20,517 మంది మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు వెంటనే సమీపంలోని చౌకధరల దుకాణాలకు వెళ్లి, ఈ-పాస్ యంత్రాల ద్వారా వేలిముద్రలు వేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు.