News July 28, 2024
వరంగల్ : చింతచిగురు @కిలో రూ.500

వానాకాలంలో చింతచిగురు లభిస్తోంది. దీంట్లో పొషకాలు అధికంగా ఉండటంతో జనాలు దీన్ని తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. నగరంలో చింతచిగురు తక్కువ దొరకడంతో ఆదివారం మట్టెవాడ, మండిబజార్ తదితర ప్రాంతంలో రూ.500 రేటు పలుకుతోంది. ఎలాంటి రసాయనాలు లేకపోవడం, ప్రకృతి సిద్ధంగా లభించడంతో దీనికి ఇంతలా డిమాండ్ ఉంది.
Similar News
News August 6, 2025
వసతి గృహాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను తరచూ ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమం, భద్రత, పోషకాహారం, పరిశుభ్రత, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సూచించారు. తనిఖీలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News August 5, 2025
కళాశాలల్లో ఆధార్, అపార్ నవీకరణ: వరంగల్ డీఐఈఓ

జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఆధార్, అపార్ నవీకరణ చేపట్టాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. విద్యార్థులకు అందుబాటులోనే అన్ని సేవలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎల్బీ కళాశాలలో నిర్వహిస్తున్న ఆధార్ నవీకరణను శ్రీధర్ సుమన్ పరిశీలించి విద్యార్థులకు సకాలంలో సేవలందించాలని సూచించారు.
News August 5, 2025
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వరంగల్ కలెక్టర్

ఖానాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. ఖానాపురం మండలం ఐనపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయం, జడ్పీ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనాన్ని చేశారు.