News December 15, 2025
వరంగల్: చిన్నారి, వృద్ధురాలిపై వీధి కుక్క దాడి

జిల్లాలోని ఖిలా వరంగల్ మండలం 40వ డివిజన్‌లో ఉర్సు ప్రాంతంలో వీధి కుక్క రెచ్చిపోయింది. పిచ్చి కుక్క దాడిలో చిన్నారి, వృద్ధురాలు గాయపడ్డారు. బాధితులను స్థానికులు అంబులెన్స్‌లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల సమస్యపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 17, 2025
సూర్యాపేట: @ ఒంటిగంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన 3వ విడత ఎన్నిక పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 82.59%
గరిడేపల్లి – 87.72%
హుజూర్‌నగర్ – 83.18%
మట్టంపల్లి – 88.97%
మేళ్లచెరువు – 85.08%
నేరేడుచర్ల – 86.14%
పాలకవీడు – 87.60%
జిల్లా వ్యాప్తంగా 86.19% నమోదైందన్నారు.
News December 17, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

జిల్లాలోని 7 మండలాల్లో గల 158 పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. అచ్చంపేట, లింగాల, అమ్రాబాద్ తదితర మండలాల్లో అధికారులు తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం సర్పంచ్ ఫలితాలను వెల్లడించనున్నారు. మేజర్ పంచాయతీల ఫలితాలు వెలువడటానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని, అనంతరం ఉపసర్పంచుల ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు.
News December 17, 2025
ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్- కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల జిల్లాలో 3విడతలలో భాగంగా 6 మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, ఎండపల్లి, బుగ్గారం, వెల్గటూర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒంటిగంటలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.


