News April 14, 2024
వరంగల్: చోరీ చేసిన చర్చి పాస్టర్

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పరావుపేటలో ఈ నెల 11న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. సీఐ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. అలంఖానిపేటకు చెందిన దంతాల రవి అప్పలరావుపేటలో చర్చి పాస్టర్‌గా పని చేస్తున్నాడు. రోజూ చర్చికి వెళ్లే వీరభద్రరావుకు రవికి పరిచయం ఏర్పడింది. దీంతో రవి.. వీరభద్రరావు ఇంట్లో లేని సమయంలో 6 తులాల బంగారం, రూ.60,200 చోరీ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.
Similar News
News April 20, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ CP సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తరిగొప్పుల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, కానిస్టేబుల్ రాజు ఓ కేసు విషయంలో నిందితుడికి సహకారం అందించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువవడంతో వారిని సస్పెండ్ చేశారు.
News April 20, 2025
KU డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News April 20, 2025
వరంగల్: ‘గిరికతాటి’ కల్లుకు కేరాఫ్ ‘పాకాల’

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరకతాటి కల్లు ఎక్కడ దొరుకుతుందంటే ఠక్కున గుర్తొచ్చేది ఖానాపురం మండలం పాకాల. నర్సంపేట నుంచి పాకాలకు వెళ్లే దారి మధ్యలో సుమారు 60 గిరికతాటి చెట్లు ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి, పక్కనే పాకాల వాగు వద్ద దొరికే ఈ కల్లు కోసం HYD, WGL, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ప్రతి ఏటా వేలం పాటలో గీతకార్మికులు ఈ చెట్లను దక్కించుకుంటారు. ఇక్కడ కుండ చికెన్ కూడా ఫేమస్.