News October 8, 2025
వరంగల్: జడ్జిమెంట్ డే.. సర్వత్రా ఆసక్తి!

స్థానిక ఎన్నికల సంగ్రామానికి ఆరంభంలోనే ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. బ్యాలెట్ పోరు పల్లెల్లో రాజుకోకముందే కోర్టు మెట్లెక్కింది. బీసీ రిజర్వ్ అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ కాస్త మందగించింది. హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం నేడు విచారణకు రానుండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న ఆశావహులు కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు.
Similar News
News October 8, 2025
ఇంటర్ బాలికపై హత్యాచారం!

నిన్న నల్గొండలో ఇంటర్ బాలిక (17) హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ట్రాక్టర్ డ్రైవరైన గడ్డం కృష్ణ (22)తో బాలికకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. స్నేహితుడి సాయంతో కృష్ణ ఆమెను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు.. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆందోళన చెందడంతో బాలిక చనిపోయిందని చెప్పినట్లు సమాచారం. తమ కూతురిపై హత్యాచారం జరిగిందని పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.
News October 8, 2025
KNR: సర్దుకుపోతారా..? సాగదీస్తారా..?

మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్‌పై చేసిన వ్యాఖ్యలు CONGలో ప్రకంపనలు సృష్టించాయి. రంగంలోకి దిగిన PCC చీఫ్ మహేష్ గౌడ్ నేడు ఇరువురితో మాట్లాడనున్నారు. ఇప్పటికే నేనెవర్నీ ఏం అన్లేదని పొన్నం, తననుద్దేశించే మాట్లాడాడని అడ్లూరి అంటున్నారు. ఇవే మాటలపై ఇద్దరు మంత్రులుంటే సీన్ కంటిన్యూ అయ్యే అవకాశముంది. కాగా, పార్టీ పెద్దలు మంత్రులకు నచ్చజెప్పి గొడవకు ఫుల్ స్టాప్ పెడతారా లేదా అనేది కొద్ది గంటల్లో తేలనుంది.
News October 8, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరిగి తొలిసారి రూ.1,23,170కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.1,050 ఎగబాకి రికార్డు స్థాయిలో రూ.1,12,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.100 తగ్గి రూ.1,67,000కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.