News March 31, 2025
వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News September 10, 2025
WGL: గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తుల స్వీకరణ

వరంగల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారి అపర్ణ తెలిపారు. ఈనెల 12న ఉదయం 9 గంటలకు రాయపర్తి గురుకుల పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్, ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మెరిట్ జాబితా ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారని పేర్కొన్నారు.
News September 10, 2025
ఫేక్ మెసేజ్‌లపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు. లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి’ అంటూ వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను నమ్మొద్దని వరంగల్ పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు లింకులు మోసాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలి అని సూచించారు. ఫేస్‌బుక్‌లో అధికారిక పేజీ ద్వారా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News September 9, 2025
వరంగల్: 136 ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా ప్రజల నుంచి 136 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, ఇతర శాఖలకు 28 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.