News April 4, 2025
వరంగల్: జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తండ్రి, కొడుకు

ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న 57వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు న్యాయ నిర్ణేతగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన కోట రాంబాబు ఎంపికయ్యాడు. ఆయన కుమారుడు సృజన్ ఖోఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో వారిని గ్రామస్థులు అభినందించారు.
Similar News
News April 5, 2025
గద్వాల: అది దారుణం: BRS

గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని BRS రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గద్వాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. మండలంలో ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి ఇళ్లు కేటాయించడం దారుణమన్నారు. మిగిలిన గ్రామాల్లో అర్హులు లేరా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
News April 5, 2025
KMR: 9 నెలల జైలు శిక్ష

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతికి కారణమైన నిందితుడికి KMR జిల్లా న్యాయస్థానం 9 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. బిక్కనూర్ పోలీసుల వివరాల ప్రకారం ముత్త గౌడ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. బోయిన స్వామి అతివేగంగా ఆటోతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముత్త గౌడ్ మృతి చెందాడు. బిక్కనూర్ PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఈ మేరకు తుది తీర్పు ఇచ్చారు.
News April 5, 2025
బదనకల్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ముస్తాబాద్ మండలం బాదనకల్ గ్రామంలోని ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. పోలీసుల వివరాలు.. పాతూరి మల్లమ్మ(54) గర్భకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్ తిరిగిన ఆమె వ్యాధి నయం కాలేదు. శుక్రవారం తన వ్యవసాయ పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.