News March 9, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

image

వరంగల్, హన్మకొండలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. విత్‌ స్కిన్ కేజీ రూ.140, లైవ్ కోడి రూ.100 పలుకుతోంది. సిటీకి పల్లెలకు రూ.10-20 తేడా ఉంది. గత 2 వారాల క్రితం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చాలా మంది మటన్‌, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపగా మళ్లీ వారం రోజుల నుంచి చికెన్ అమ్మకాలు పెరిగాయని, షాపు నిర్వాహకులు చెబుతున్నారు.

Similar News

News February 17, 2026

NGKL: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు

image

ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వక తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, MLA మెఘారెడ్డి తదితర నాయకులు సీఎం కలిశారు. ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలలో వచ్చిన ఫలితాలను ఆయనకు వివరించారు. ఎన్నికలలో 90 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీ ఫలితాలు సాధించడం పట్ల సీఎం నాయకులను అభినందించారు.

News February 17, 2026

పసిబిడ్డ ఆరోగ్యం కోసం..

image

ప్రెగ్నెన్సీలో తల్లి ఎదుర్కొనే పరిస్థితులు బిడ్డ మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. తల్లి కఠిన పరిస్థితుల్లో జీవిస్తుంటే అవి మెదడుపై ప్రతికూల ఫలితాలు చూపిస్తాయి. డిప్రెషన్, ఓవర్ థింకింగ్, ఒత్తిడి వల్ల శిశువుల మెదడులో నాడుల మధ్య అనుసంధానం బలహీనంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందుకే ఎలాంటి గడ్డు పరిస్థితిలోనైనా గర్భిణులు ద్యానం, వ్యాయామం చేయడం మానకూడదని సూచిస్తున్నారు.

News February 17, 2026

అనకాపల్లి: ఇంటర్ పరీక్షలు.. ఉ.9 దాటితే నో ఎంట్రీ

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు 26,301 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు DIEO వినోద్ బాబు తెలిపారు. వీరిలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 13,153 మంది ఉన్నారని చెప్పారు. మొత్తం 34 పరీక్షా కేంద్రాలకు 500 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులు పావుగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.