News March 11, 2025
వరంగల్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

వరంగల్ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.
Similar News
News March 11, 2025
చేర్యాల: CMRF చెక్కు అందజేసిన మంత్రి

మంత్రి కొండా సురేఖ తన CMRF చెక్కును అందజేశారు. చేర్యాల మండలం నాగపురి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ప్రశాంత్ కుమారుడు నయన్ కుమార్ మాటలు రాక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏ హాస్పటల్‌కి పోయినా రూ. 8 నుంచి 10లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సూచనతో తక్షణమే వారి పరిస్థితి తెలుసుకొని కింగ్ కోటిలోని ప్రభుత్వ ENT ఆసుపత్రికి రూ. 8లక్షలను CMRF చెక్కును మంత్రి అందజేశారు.
News March 11, 2025
ములుగు: గిరిజన యూనివర్సిటీ వీసీ నియామకం

ములుగు జిల్లా సమక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌ను భారత ప్రభుత్వం/ కేంద్ర విద్యా శాఖ నియమించింది. హైదరాబాదులోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ యెడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
News March 11, 2025
WGL: క్వింటా పత్తి ధర రూ.6,950

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.10 తగ్గి.. రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.