News March 10, 2025
వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News November 7, 2025
హెక్టారుకు ₹50,000 ఆర్థికసాయం: అచ్చెన్న

AP: రేట్లు లేక నష్టపోయిన ఉల్లి రైతులకు త్వరలోనే హెక్టారుకు ₹50వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం అందుతుందన్నారు. ధరలు పడిపోయినప్పుడు క్వింటాలుకు ₹1,200 చొప్పున ₹18కోట్ల సరకు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ₹10 కోట్లు ఇచ్చామని, మరో ₹8కోట్లు త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు.
News November 7, 2025
రాజోలు: అండర్ 14 క్రికెట్ జట్టుకు రితీశ్ రాజ్ ఎంపిక

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఎంపిక కార్యక్రమంలో మలికిపురానికి చెందిన బత్తుల రితీశ్ రాజ్ అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారుడు. ఈ సందర్భంగా దళిత చైతన్య వేదిక నాయకులు రితీశ్ రాజ్‌ను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పాలమూరి శ్యాంబాబు, బత్తుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.


