News December 14, 2025
వరంగల్ జిల్లాలో ప్రారంభమైన రెండో విడత పోలింగ్

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీల్లో రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగనుంది. 2 గంటల నుంచి వార్డు సభ్యుల ఓట్లను 25 చొప్పున బండిళ్లు కట్టిన అనంతరం లెక్కిస్తారు. సర్పంచ్ ఫలితాలు సాయంత్రం 4 గంటల నుంచి వెలువడనున్నాయి. 6 జిల్లాల్లోని 508 జీపీలకు 1686 మంది సర్పంచ్ అభ్యర్థులు, 4020 వార్డుల్లో 9884 మంది పోటీ పడుతున్నారు.
Similar News
News December 14, 2025
రేపు గుడివాడకు రానున్న వందే భారత్

వందే భారత్ రైలు సేవలు రేపటి నుంచి గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుడివాడలో కూడా ఆగనుంది. చెన్నై-విజయవాడ వందే భారత్ (20677) రైలును నర్సాపురం వరకు రైల్వే శాఖ పొడిగించింది. అయితే నర్సాపూర్, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్, బెంగళూరుకు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News December 14, 2025
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.
News December 14, 2025
విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.


