News February 13, 2025

వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News February 19, 2026

10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈవోలు, హెడ్ మాస్టర్లతో డీఈఓ రంగయ్య నాయుడుతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9,492 మంది ఉన్నారని, ఫలితాల మెరుగుదలకు పాఠశాల స్థాయిలో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని హెడ్ మాస్టర్లను ఆదేశించారు.

News February 18, 2026

అంగన్వాడీ సూపర్‌వైజర్లు నిర్లక్ష్యం వీడాలి: కలెక్టర్

image

అంగన్వాడీ సూపర్‌వైజర్లు పని తీరులో నిర్లక్ష్యం, లక్ష్యాలు సాధించడంలో వెనుకబడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ పని తీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొంతమంది సూపర్‌వైజర్లపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. CDPOలు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, సేవల అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు.

News February 18, 2026

రైతుల సాగు వివరాలు నమోదు చేయాలి: కలెక్టర్

image

రైతుల పంటల సాగును ఏఈఓలు సందర్శించి సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనురాధతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులతో ఫార్మర్ రిజస్టరీ, క్రాప్ బుకింగ్, యూరియా నిల్వలు, రైతుబీమాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏఈఓలు వారి పరిధిలోని గ్రామాలలో రైతుల రిజిస్టర్‌కు సంబంధించి ఐడి క్రియేట్ చేయాలన్నారు.