News January 4, 2026

వరంగల్ జిల్లాలో యూరియా కొరత లేదట..?

image

జిల్లాలో యూరియా కొరత లేదని, యాసంగి పంటలకు సరిపడా నిల్వలు ఉన్నాయని WGL జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఇప్పటి వరకు 1,11,435 ఎకరాల్లో సాగు జరగగా 3,56,392 బస్తాల యూరియా సరఫరా చేశామన్నారు. పీఏసీఎస్‌లు, డీలర్ల వద్ద 890 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 3,300 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. కానీ రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News January 6, 2026

ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలించాలి: కలెక్టర్

image

నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీలు నిర్ణీత గడువులోగా తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టణాల పరిధిలో జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. పార్టీల ప్రతినిధులు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు, చేర్పులపై స్పందించాలన్నారు.

News January 6, 2026

పంట వ్యర్థాలను కాల్చొద్దు: వరంగల్ డీఏవో

image

ప్రత్తి పంటల కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందడంతోపాటు భూసారం పెంచి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె.అనురాధ తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశించడమే కాకుండా గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.

News January 6, 2026

వరంగల్: రెన్యువల్ చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ జాప్యం!

image

వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించి అనుమతుల పునరుద్ధరణ(రెన్యువల్) చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లాలో 180కి పైగా ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా అందులో సగానికి పైగా రెన్యువల్ కాలేదు. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు సీఎం సహాయ నిధి పథకం కింద వైద్యం అందించలేకపోతున్నారు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని ఆసుపత్రుల నిర్వాహకులు వాపోతున్నారు.