News September 11, 2025
వరంగల్ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలి: CM

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయాలపై రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరంగల్ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం అన్నారు.
Similar News
News March 3, 2026
పెద్దపల్లి: అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు: SE

పెద్దపల్లి సర్కిల్‌లో విద్యుత్ లేని 69 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని SE వి.గంగాధర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ లేని కేంద్రాలను గుర్తించి, అంతర్గత వైరింగ్, ఇతర సదుపాయాలతో పాటు విద్యుత్ సేవలను వేగంగా అందిస్తున్నామన్నారు.
News March 3, 2026
సిరిసిల్ల: జిల్లా ఎస్పీని కలిసిన వేములవాడ డీఎస్పీ

వేములవాడ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు జిల్లా ఎస్పీ మహేష్ బి గితేను మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయనకు సూచించారు.
News March 3, 2026
WGL: మన పెద్ద పులి కనిపించకుండా పోయింది..!

పాకాల అడవుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పెద్దపులి 2009లో కనుమరుగైంది. ఆరోజుల్లో పాకాల జనావాసాల మధ్యన రోడ్లపైకి వస్తే జనం భయభ్రాంతులకు గురయ్యేవారు. చివరిగా ఆ పులి, 2009లో కనిపించిందని, అది వేటకు గురై ఉంటుందని వరంగల్ విశ్రాంత అటవీ శాఖ అధికారి తెలిపారు. జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్న పులుల ఆనవాళ్లు మహారాష్ట్ర తడోబా, ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి అరణ్యాలకు చెందినవన్నారు.
# నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం


