News March 5, 2025

వరంగల్ జిల్లాలో విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

అప్పుల భారం భరించలేక పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామానికి చెందిన సాంబారి రాజు తన అవసరాల నిమిత్తం వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేక సోమవారం ఏదో పురుగుల మందు తాగగా వరంగల్ ఎంజీఎంకి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందగా మంగళవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 5, 2025

వరంగల్: ‘పరీక్ష కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా ఉండడం నిషేధం’

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో బీఎన్ఎన్ఎస్ 163 చట్టం అమలులో ఉంటుందన్నారు. నేటి నుంచి గుంపులుగా ఉండడం, ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించడం, ఊరేగింపులు చేయడం నిషేధించబడతాయని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

News March 5, 2025

వరంగల్‌కు కొత్త పోలీస్ జాగిలాలు

image

నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు నూతనంగా వచ్చిన పోలీస్‌ జాగిలాలను సీపీ మంగళవారం పరిశీలించారు. గత నెల 28న పోలీస్‌ జాగిలాల శిక్షణా కేంద్రంలో 8 నెలల శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన 5 పోలీస్‌ జాగిలాలు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ డాగ్‌ స్వ్కాడ్‌లో చేరి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాయి.

News March 5, 2025

వరంగల్ జిల్లా నేటి టాప్ న్యూస్

image

వరంగల్: నేడు మంచినీటి సరఫరాకు అంతరాయం☑️విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగొద్దని సీఎస్ శాంతకుమారి ఆదేశం☑️వర్ధన్నపేట: నీరు లేక ఎడారిగా మారుతున్న ఆకేరు వాగు☑️నల్లబెల్లి: నేషనల్ స్కాలర్షిప్‌కు ఎంపికైన విద్యార్థిని☑️వరంగల్‌కు కొత్త పోలీసు జాగిలాలు☑️వరంగల్ అతివేగంగా డివైడర్‌ని ఢీ కొట్టి వ్యక్తి మృతి☑️మామునూరు: ఎయిర్‌పోర్టు భూముల వద్ద ఉద్రిక్తత

error: Content is protected !!