News October 8, 2025
వరంగల్ జిల్లాలో స్థానిక టెం‘డర్’

స్థానిక పోరుకు, మద్యం టెండర్లకు హైకోర్టు తీర్పే కీలకం కానుంది. ఈనెల 18తో ముగిసే మద్యం షాపుల టెండర్లకు స్థానిక సంస్థల నోటిఫికేషన్ గండి కొట్టింది. కుప్పలు, తెప్పలుగా పడే టెండర్లు ఆశావహులకు ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. టెండర్ ధర రూ.3లక్షలు పెట్టడంతో WGL జిల్లాలో సిండికేట్‌కు మొగ్గు చూపుతున్నారు. టెండర్లకై తలా రూ.50వేల చొప్పున జమ చేస్తుండగా, నేడు వచ్చే తీర్పు అనంతరం టెండర్ల దాఖలు ఊపందుకోనుంది.
Similar News
News April 1, 2026
మేం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు: జగన్

AP: అమరావతికే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తాము వ్యతిరేకం కాదని ప్రెస్‌మీట్‌లో YCP చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ‘అమరావతి పేరుపై అప్పులు తెచ్చి స్కామ్‌లు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీకి రూ.2లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చు చేసే స్థోమత మనకు ఉందా? ఏడేళ్లలో CBN ఖర్చు పెట్టింది రూ.8వేల కోట్లే. వీటికి అసెంబ్లీలో CBN సమాధానం చెప్పాడా?’ అని ప్రశ్నించారు.
News April 1, 2026
టీ తోటలో మోదీ.. కార్మికులతో ముచ్చట్లు

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిబ్రూగఢ్‌లోని టీ తోటలను సందర్శించారు. అక్కడ తేయాకు కోస్తున్న మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న మోదీ.. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో వారి శ్రమ అమూల్యమైనదని కొనియాడారు. తోటల్లో మహిళలతో కలిసి సరదాగా కాసేపు తేయాకు కోశారు. ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.
News April 1, 2026
అనకాపల్లి: రూ.1192.45 కోట్ల మద్యం తాగేశారు

అనకాపల్లి జిల్లాలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.1192.45 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో మద్యం బాక్సులు 15.47 లక్షలు, బీర్ బాక్సులు10.11 లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1139.26 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో దీనిపై 5 శాతం పెరిగాయి. 2024-25తో పోలిస్తే 2025-26లో 59 శాతం బీర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.


