News May 7, 2025

వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఖిలా వరంగల్-42.6, ములుగు రోడ్డు-42.9, సీరోలు(MHBD)-42.4, జఫర్‌గడ్(జనగామ)-42.8, కన్నాయిగూడెం(ములుగు)-43.2, ములుగు 42.5గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News April 13, 2026

అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద జరిగే ఉత్సవాలకు అధికారులు, ఎస్సీ సామాజిక వర్గ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. జిల్లా అధికారులు ఈ వేడుకల్లో తప్పనిసరిగా పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఆదేశించారు.

News April 13, 2026

TCSలో మత మార్పిడులు, లైంగిక వేధింపులపై విచారణ: ఛైర్మన్

image

నాసిక్ <<19633913>>TCS<<>> క్యాంపస్‌లో మత మార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. వాస్తవాలను గుర్తించేందుకు COO ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. కాగా అసిఫ్, షఫీ, షారుఖ్, రజా, తౌసిఫ్, డానిష్ అనే ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.

News April 13, 2026

సిరిసిల్ల: ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేములవాడ నుంచి కరీంనగర్ రోడ్డులో అవసరమైన సైన్ బోర్డు పెట్టి రంబుల్ స్టెప్స్ ఏర్పాటు చేయాలన్నారు. హెల్మెట్ వినియోగం సీట్ బెల్ట్ ఇతర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.