News November 30, 2025
వరంగల్ జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌గా బాల మాయాదేవి

రెండో దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు వరంగల్ జిల్లా జనరల్ అబ్జర్వర్‌గా రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్ బి. బాల మాయాదేవిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు, సమస్యలను 8712735548 సెల్‌కు తెలియజేయాలని కలెక్టర్ డా. సత్య శారద కోరారు.
Similar News
News February 15, 2026
WGL: కార్యకర్తలు ఎవరు? కట్టప్పలు ఎవరు?

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార-ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. కొన్ని వార్డుల్లో అనూహ్య ఫలితాలు రావడంతో అంతర్గత విభేదాలు, అసంతృప్తి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పని చేయాల్సిన వారే ప్రత్యర్థులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమికి బాధ్యులెవరు అన్న దానిపై నేతలు సమీక్షలు చేపడుతున్నారు.
News February 13, 2026
నర్సంపేటలో బీజేపీ బోణీ

నర్సంపేట మున్సిపాలిటీ పరిధి 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి జూలూరి రోజా రాణి విజయం సాధించారు. ఈ ఫలితంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మొదటి సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన జూలూరి రోజా రాణి తొలి ప్రయత్నంలోనే గెలుపొందారు.
News February 13, 2026
నర్సంపేట నాలుగో వార్డు కాంగ్రెస్ కైవసం

నర్సంపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో నాలుగో వార్డు ఫలితం వెలువడింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం భరత్ రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన సహోదరుడు బీరం నాగిరెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజయం నాలుగో వార్డులో కాంగ్రెస్ బలాన్ని మరింత పటిష్టం చేయగా, స్థానికంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.


