News September 20, 2025

వరంగల్: జీపీవోలకు అవగాహన సమావేశం

image

వరంగల్ జిల్లాలో కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు నిబద్ధతతో పని చేసి పారదర్శక పరిపాలన అందించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలతో సమన్వయం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Similar News

News September 20, 2025

వరంగల్ జిల్లాకు వర్ష సూచన..!

image

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏ సమయంలోనైనా తుపాన్ ముప్పు, ఏ క్షణమైనా అతి తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. భారీ వరదలు, తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని, ఈనెల 27 వరకు ఏ రోజైనా, ఎక్కడైనా అతి తీవ్ర వర్షం కురిసే అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

News September 20, 2025

దేవుడి భూములపై గట్టిగా లీగల్ ఫైట్ చేయాలి: మంత్రి

image

దేవుడి భూములపై లీగల్ ఫైట్ గట్టిగా చేయాలని, అసలు న్యాయ పోరాటం స‌రైన రీతిలో ఎందుకు జ‌ర‌గ‌ట్లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పేషీలో ఎండోమెంట్ గవర్నమెంటు ప్లీడర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ఎండోమెంట్ కేసుల విషయంలో న్యాయవాదులతో ప్రతి 6 నెలలకొక సారి సమావేశం పెట్టి స్టేటస్ చెప్పాలని అధికారులను ఆదేశించారు.

News September 20, 2025

వరంగల్ జిల్లాలో 107 పాఠశాలల్లో స్ఫూర్తి కార్యక్రమం!

image

వరంగల్ కలెక్టర్ సత్య శారద ఆలోచనల మేరకు జిల్లాలోని 107 ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, విద్యాసంస్థల్లో శనివారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, మానసిక దృక్పథం పెంపొందించడమే లక్ష్యంగా అధికారులు, ఉపాధ్యాయులు, విశ్రాంత అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల శ్రేయస్సుపై చర్చించారు.