News October 12, 2025

వరంగల్: జీవాంజీ దీప్తికి గోల్డ్ మెడల్..!

image

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతున్న వర్ట్చూస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2025లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్ జీవాంజీ దీప్తి గోల్డ్ మెడల్ సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో శనివారం క్వాలిఫైయింగ్ రౌండ్ పూర్తి చేయగా, ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో దీప్తిని కోచ్‌తో పాటు తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News October 12, 2025

నిర్మల్: ఈ నెల 14 జిల్లా బ్యాట్మెంటన్ జట్ల ఎంపిక

image

U- 14, 17 జిల్లాస్థాయి బ్యాట్మెంటన్ బాలబాలికల జట్లు ఎంపిక చేయనున్నట్లు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. ఈ నెల 14న జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయంలో హాజరుకావాలని సూచించారు.

News October 12, 2025

కాంగ్రేస్ జిల్లా అధ్యక్ష బరిలో 8 మంది దరఖాస్తులు

image

జయశంకర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కోసం ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన జిల్లాకు చెందిన నాయకులు అధ్యక్ష పదవిని ఆశిస్తూ తమ బయోడేటాను రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ ఛైర్మన్, జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్ రెడ్డికి దరఖాస్తులను అందజేశారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న పేర్లను త్వరలో అధిష్ఠానానికి పంపి ఎంపిక చేయనున్నారు.

News October 12, 2025

చిదంబరం మాటలు.. కాంగ్రెస్‌లో మంటలు!

image

కాంగ్రెస్ నేత చిదంబరం చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 26/11 ముంబై దాడులకు ప్రతీకారంగా పాక్‌పై అటాక్ చేయకుండా అమెరికా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గినట్లు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సైనిక చర్య తప్పుడు మార్గమని తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, మోదీ లైన్‌లో చిదంబరం మాట్లాడుతున్నారని మండిపడింది.