News February 27, 2026

వరంగల్‌: టమాటా మిర్చి క్వింటా రూ.50 వేలు

image

వరంగల్ ఎనుమామూల వ్యవసాయ మార్కెట్లో టమాటా మిర్చి బంగారం, వెండి ధరలతో పోటీపడి పెరుగుతున్నాయి. శుక్రవారం క్వింటా టమాటా మిర్చి రూ.50,000 ధర పలికింది. ఈ నెల 18న క్వింటాలు కు రూ.35,000 ధర రాగా, 19న రూ.36,000, 23న రూ.37,000, 25, 26న రూ.40,000 ధర పలకగా, శుక్రవారం ఒక రోజే క్వింటాకు రూ.10,000 పెరిగి, రూ.50,000 అత్యధిక ధర పలికింది. 10 రోజుల్లో క్వింటా రూ.10,000 ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 27, 2026

చేపలపై చెరువుల్లో నీటి నాణ్యత ప్రభావం

image

చెరువుల్లో నీరు ఎంత నాణ్యంగా ఉంటే చేపలు అంత ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతాయి. నీటి నాణ్యత చెడిపోతే చేపల్లో ఒత్తిడి, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. చేపలు ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం లీటరు నీటికి 5 మి.గ్రా. DO(డిసాల్వ్ ఆక్సిజన్) ఉండాలి. ఇది 3 మి.గ్రా. కంటే తక్కువైతే చేపలు బలహీనపడతాయి, 1 మి.గ్రా. కన్నా తక్కువైతే చేపలు చనిపోవచ్చు. తెల్లవారుజామున, మబ్బు వాతావరణం, వర్షపు రోజుల్లో డిఓ తక్కువగా ఉంటుంది.

News February 27, 2026

NCERT బుక్‌లో ఏముంది?

image

‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంలో సుప్రీంకోర్టులో 81వేలు, హైకోర్టుల్లో 62 లక్షలు, జిల్లా, కింది కోర్టుల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని <<19224324>>NCERT<<>> పేర్కొంది. జడ్జిల కొరత, మౌలిక సౌకర్యాలు లేమి, సంక్లిష్టమైన న్యాయప్రక్రియలే దీనికి కారణమని తెలిపింది. న్యాయమూర్తులకూ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందని.. 2017-21 మధ్య వారిపై 1,600 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. కాగా దీనిని CJI <<19243239>>బ్యాన్<<>> చేశారు.

News February 27, 2026

ఆదిలాబాద్: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 491 గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగియగా మొత్తం 9,226 మంది విద్యార్థులకు 8,735 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 8,204 మందికి 366 మంది విద్యార్థులు, వొకేషనల్ విభాగంలో 1,022 విద్యార్థులకు 125 మంది విద్యార్థులు, మొత్తం 491 మంది ఎగ్జామ్‌కు గైర్హాజరైనట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ వెల్లడించారు.