News February 18, 2025

వరంగల్: టూరిస్టుల కోసం స్పెషల్ బస్సు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రదేశాల సందర్శన కోసం టూరిజం సంస్థ ప్రత్యేక ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. ఈనెల 20న ఉదయం 7.45కు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, రామప్ప, లక్నవరం, రాత్రి ఖిలా వరంగల్ సందర్శన అనంతరం రాత్రి 8 గంటలకు హన్మకొండకు చేరుకుంటుంది. పెద్దలకు రూ.980లు, పిల్లలకు రూ.790లుగా టికెట్ ధర నిర్ణయించారు.

Similar News

News November 8, 2025

వరంగల్ కమిషనరేట్ పరిధిలో 137 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 137 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 78, సెంట్రల్ జోన్ పరిధిలో 28, వెస్ట్ జోన్ పరిధిలో 17, ఈస్ట్ జోన్ పరిధిలో 14 కేసులు నమోదయ్యాయి.

News November 8, 2025

OP పింపుల్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

image

జమ్మూకశ్మీర్ కుప్వారా(D) కెరాన్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. చొరబాటుపై పక్కా సమాచారంతో ‘ఆపరేషన్ పింపుల్’ పేరుతో గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఓచోట నక్కిన టెర్రరిస్టులను గుర్తించడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రమూకలు హతమయ్యారని, మరికొందరు ట్రాప్‌లో చిక్కుకున్నారని వెల్లడించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.

News November 8, 2025

వరంగల్: త్రిసభ్య కమిటీ నివేదిక ఏమైంది..?

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో టెండర్లు లేకుండా రూ.2 కోట్ల వరకు నిధులను ఖర్చు చేశారనే ఆరోపణలపై <<18148710>>డీఎంఈ ముగ్గురితో విచారణకు<<>> ఆదేశించిన విషయం తెలిసిందే. అక్టోబరు 30న సాయంత్రం 5 గంటల్లోపే నివేదికను తనకు అందజేయాలంటూ ఆర్డర్లో ఇచ్చిన డీఎంఈకి.. అదే రోజు త్రిసభ్య కమిటీ సభ్యులు నివేదిక అందజేశారు. డీఎంఈకి నివేదిక అంది పది రోజులైనా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.