News August 14, 2025
వరంగల్: డీసీసీబీ పాలకవర్గం గడువు మరో ఆరు నెలలు పొడిగింపు

జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) పాలకవర్గం గడవు మరో ఆరు నెలలు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం పాలక వర్గాల గడువును పెంచడం సర్వత్రా జిల్లాలో చర్చ జరుగుతోంది. టెస్కాబ్ ఛైర్మన్‌గా ఉన్న మార్నేని రవీందర్ రావు మరో ఆరు నెలలు ఈ పదవిలో కొనసాగనున్నారు.శుక్రవారం డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు నిర్వహించనున్నారు.
Similar News
News August 14, 2025
జగన్ ప్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారు: ఆనం

పులివెందుల, ఒంటిమిట్టలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడంతో జగన్‌కు ప్రస్టేషన్ వచ్చిందని.. అదే ఊపులో మాట్లాడుతున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలిసారి పులివెందుల, ఒంటిమిట్ట ఓటర్లు స్వేచ్ఛగా ఓటేశారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఓటర్లు గెలిపించారని కొనియాడారు. చంద్రబాబు వయస్సుకు జగన్ గౌరవం ఇవ్వాలని హితవు పలికారు.
News August 14, 2025
తిరుపతి స్విమ్స్‌లో MBBS అడ్మిషన్ల ప్రారంభం

తిరుపతి స్విమ్స్, శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో MBBS అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలుకు చెందిన సాయిశ్రీ నిత్య నీట్-2025లో 14,255వ ర్యాంకు సాధించింది. ఆమెకు ఇక్కడ మొదటి అడ్మిషన్ ఇచ్చారు. ఆలిండియా కోటా ద్వారా ఈ కాలేజీకి 26 సీట్లు కేటాయించారు. ఓ అడ్మిషన్ పూర్తయ్యందని స్విమ్స్ ఉపకులపతి డా.ఆర్.వి.కుమార్ చెప్పారు.
News August 14, 2025
‘వార్ 2’ వచ్చేది ఈ OTTలోకేనా?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ మూవీ ఇవాళ విడుదలైంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తుందని సమాచారం. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తుందని టాక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు.