News February 27, 2026
వరంగల్: డ్రంకెన్ డ్రైవ్‌లో 111 మందిపై కేసులు

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గురువారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 111 మందిని పట్టుకున్నారు. ట్రాఫిక్ విభాగంలో 42, సెంట్రల్ జోన్‌లో 34, వెస్ట్ జోన్‌లో 16, ఈస్ట్ జోన్ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Similar News
News March 3, 2026
NLG: పర్యాటక సర్క్యూట్ @ బుద్ధవనం!

నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫణిగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట వంటి బౌద్ధ క్షేత్రాలను బుద్ధవనంతో అనుసంధానిస్తూ అంతర్జాతీయ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తాజాగా మంత్రి జూపల్లి వెల్లడించారు. PPP విధానంలో ఆరామాలు, ధ్యాన కేంద్రాలతో బుద్ధవనాన్ని ఒక విశ్వశాంతి కేంద్రంగా మార్చి, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చ
News March 3, 2026
టాటా మెమోరియల్ సెంటర్‌లో 40 పోస్టులు

<
News March 3, 2026
వలస పక్షుల విహారం.. చూపరులకు కనువిందు..!

ఓరుగల్లు అరణ్య ప్రాంతాలు, సరస్సు తీరాలు పక్షులకు నిలయాలుగా మారాయి. ఫిబ్రవరిలో విదేశాల నుంచి ఇక్కడకు వలస వచ్చి విహరిస్తుంటాయి. కొన్ని సంతాన ఉత్పత్తి చేసుకొని వేసవి ప్రారంభం కాగానే తిరిగి తమ దేశాలకు పయనిస్తుంటాయి. పలు జాతులు తమకు హాని లేదని గ్రహించి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 350 జాతుల పక్షులు ఉంటాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
#ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం.


