News November 20, 2025
వరంగల్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ

డ్రగ్స్ రహిత సమాజమే మనందరి ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలు వినియోగించే వారితో పాటు, వాటిని విక్రయాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, దీనిపై అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని సీపీ సూచించారు.
Similar News
News November 22, 2025
జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.
News November 22, 2025
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జగిత్యాల విద్యార్థిని

ZPHS వెల్లుల్లలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో బి.శ్రీవర్షిణి జగిత్యాల జిల్లా తరఫున అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపికయింది. ఈ జట్టు రేపటి నుంచి 25వ తేదీ వరకు యాదాద్రి భువనగిరిలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొననుంది. శ్రీవర్షిణి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు రాజయ్య, ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేసింది.
News November 22, 2025
యాక్సిడెంట్.. మెదక్ యువకుడు మృతి

HYD శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మెదక్ పట్టణానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణానికి చెందిన కాముని శ్రీనివాస్ కుమారుడు కాముని భారత్ (23) ఈరోజు ఉదయం రింగ్ రోడ్డుపై కారులో వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న మెదక్ కరూర్ వైశ్య బ్యాంకు మేనేజర్ భార్యకు తీవ్ర గాయాలవగా అసుపత్రికి తరలించారు. పట్టణంలో విషాదం అలుముకుంది.


