News March 19, 2025

వరంగల్: తగ్గిన అరుదైన రకం మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి నిన్నటిలాగే రూ.15,800 ధర వచ్చింది. 5531 రకం మిర్చి నిన్న రూ.11,000 ధర పలకగా నేడు రూ. 10,500కి తగ్గింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.30 వేలు ధర, సింగిల్ పట్టి మిర్చికి మంగళవారం రూ.33వేలు ధర రాగా నేడు రూ. 31వేలకి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 2, 2025

గుడ్‌న్యూస్.. జెప్టోలో ఆ ఛార్జీలు ఉండవు!

image

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్లపై హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్, రెయిన్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇకపై ₹99 కంటే ఎక్కువున్న ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేయనుంది. ‘10 నిమిషాల డెలివరీ’ మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹99 కంటే తక్కువ ఉన్న ఆర్డర్లపై మాత్రం ₹30 డెలివరీ ఫీజు వసూలు చేయనుంది.

News November 2, 2025

NRPT: పెళ్లై నెలకాలేదు.. యువకుడి ఆత్మహత్య..!

image

పెళ్లై నెలరోజులు గడవకముందే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి మిత్రుల వివరాల ప్రకారం.. నారాయణపేట(D) కోస్గి మం. నాచారంకి చెందిన రాములు(25) HYDలోని ప్రైవేట్ స్కూల్‌లో బస్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెలరోజుల కిందే వివాహం జరిగ్గా.. ఈ మధ్యే భార్యతో కలిసి హైదరాబాద్‌ వెళ్లాడు. ఏమైందో తెలీదుకాని నిన్నరాత్రి అక్కడే చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతికిగల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.