News January 2, 2025

వరంగల్: తగ్గిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌కి ఈరోజు మొక్కజొన్న తరలివచ్చింది. మంగళవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి ధర రూ.2,570 పలకగా.. ఈరోజు రూ.2,565కి పడిపోయింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర రూ.15,500 పలకగా, కొత్త 341 రకం మిర్చి సైతం రూ.15,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News January 5, 2025

కొత్త వైరస్.. హన్మకొండ డీఎంహెచ్వో సూచనలు

image

చైనా నుంచి HMPV(హ్యూమన్ మెటా ప్న్యూమో వైరస్) మహమ్మారి గురించి హన్మకొండ DMHO డా. ఏ.అప్పయ్య పలు సూచనలు చేశారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు జాగ్రత్తలు సూచించిందన్నారు. ఇది శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులలో సాధారణ చలి, జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్ అన్నారు. తెలంగాణలో HMPV కేసులపై ఎటువంటి సమాచారం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News January 5, 2025

వరంగల్ జిల్లా కలెక్టర్‌కు MLC వినతిపత్రం

image

వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద దేవిని ఈరోజు MLC బస్వరాజ్ సారయ్య, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్లు కలెక్టరేట్‌లో కలిశారు. వరంగల్ నగరానికి చెందిన కార్మిక మిల్లు భవనం స్థలంలో ఎలాంటి పర్మిషన్ ఇవ్వొద్దని, ఇచ్చిన పర్మిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కూల్చి వేసిన కార్మిక భవన్ ప్రాంతంలోనే కొత్త కార్మిక భవన్‌ను నిర్మించాలని కోరారు.

News January 5, 2025

MHBD: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

రోడ్డు భద్రత అవగాహన ప్రమాణాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి పాలనాధికారి అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తీసుకుంటున్న చర్యలు, ప్రయాణికులకు కలిగిస్తున్న అవగాహన గురించి వారు మంత్రికి వివరించారు.