News November 24, 2025
వరంగల్: తపాలా శాఖ ఫిర్యాదుల స్వీకరణ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజల నుంచి తపాలా శాఖకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. 52వ డాక్ అదాలత్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను పోస్టల్ కవర్లో కె. శ్రీకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్(స్టాఫ్ & విజిలెన్స్) పోస్టుమాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ 500001కు డిసెంబర్ 1లోపు పంపించాలన్నారు.
Similar News
News November 27, 2025
హాట్ సీట్‌గా మారిన భీమిలి..!

విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గం హాట్ సీటుగా కనిపిస్తోంది. భవిష్యత్ విశాఖ అభివృద్ధికి దిక్సూచిగా ఈ ప్రాంతం నిలుస్తుండటంతో నేతల ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. ఇప్పటికే IT అభివృద్ధిలో మధురవాడ ప్రత్యేక స్ధానం సంపాదించింది. గూగుల్, సిఫీ డేటా సెంటర్లను ఇక్కడే ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ MLA గంటా, MP భరత్ ఇక్కడ రాజకీయ ప్రాధాన్యతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
News November 27, 2025
కైకలూరు కృష్ణాజిల్లాలోకి తిరిగి వచ్చేనా..!

ఒకప్పుడు కృష్ణాజిల్లాలో భాగంగా ఉన్న కైకలూరు నియోజకవర్గం మళ్లీ జిల్లాలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత YCP హయాంలో కైకలూరును ఏలూరు జిల్లాలోకి తీసుకువెళ్లారు. ఈ విలీనాన్ని వ్యతిరేకించిన నియోజకవర్గ ప్రజలు కృష్ణాజిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్ ను బలంగా వినిపించారు. మరి కూటమి ప్రభుత్వం కైకలూరును జిల్లా పరిథిలోకి తెస్తారో, లేదో చూడాలి.
News November 27, 2025
కరీంనగర్: నియోజకవర్గానికి దూరంగా ఎమ్మెల్యేలు..?

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ MLAలకు తలనొప్పిగా మారింది. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆశావహులుగా ఉండటమే ఇందుకు కారణం. ఒక్కో గ్రామంలో 5 నుంచి 10 మంది వరకు తమ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని MLAలపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో MLAలు ఎటూ తేల్చుకోలేక మండల అధ్యక్షులకు ఎంపిక బాధ్యతలను అప్పజెప్పుతుండగా మరి కొంతమంది MLAలు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.


