News April 3, 2024

వరంగల్: తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్‌ నియామకం

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తాగునీటిని పర్యవేక్షణకు బి.గోపిని ప్రత్యేక అధికారిగా నియమించారు.

Similar News

News April 25, 2025

మావోల వేట.. కర్రె గుట్టల్లో తూటాల మోతలు

image

ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో మావోలు ఉన్నారనే సమాచారంతో మూడు రోజులుగా పోలీసులు గుట్టలను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. దాదాపు 300 కి.మీ విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో 3వేలకు పైగా భద్రతా బలగాలు మోహరించినట్లు సమాచారం. కాల్పుల్లో ఇప్పటికే పలువురు మావోలు చనిపోయినట్లు తెలుస్తోంది. వెంకటాపురం, వాజేడు, అలుబాక టేకులగూడెం, తిప్పాపురానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ కర్రె గుట్టలు ఉన్నాయి.

హన్మకొండ: భార్యా భర్తలు అదృశ్యం

image

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ కాలనీకి చెందిన భార్య భర్తలు సందీప్ కుమార్(44), మానస(40) 21 రోజుల క్రితం అదృశ్యం అయ్యారని కాజీపేట ఎస్సై నవీన్ తెలిపారు. వారి తండ్రి సంపత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.

error: Content is protected !!