News January 3, 2026

వరంగల్ తూర్పులో పోస్టింగులు ఊస్టింగులే..!

image

WGL తూర్పు ని.వ.లో పోలీసుల నౌకరి అరిటాకు కథలా మారింది. మంత్రి మాటవింటే అధికారులు వేటు వేయడం, వినకుంటే పోస్టింగ్ లెటర్లు మరొకరికి ఇవ్వడం రివాజుగా మారింది. మంత్రి, మాజీ MLC, PA, OSD, కుటుంబీకులు, అనుచరులు ఎవరి మాట వినకున్నా వారి పోస్టింగ్‌లు ఊస్టింగులే అక్కడ. ఇలాంటి పరిస్థితిలో సాహసం చేసి డ్యూటీ చేస్తే చివరకు వారికి ఆపద(సస్పెన్షన్లు) వస్తే ఆ కుటుంబం చేతులెత్తేయడం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది.

Similar News

News February 15, 2026

ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

image

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News February 15, 2026

శివుడికి నేడు ఈ ఒక్క పువ్వు సమర్పిస్తే..

image

మహాశివరాత్రి నాడు శివలింగానికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే అనంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. 11 పూలతో ఆయనను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని అంటున్నారు. ‘పంచాక్షరి మంత్రం జపిస్తూ పూలు సమర్పించాలి. ఇలా చేస్తే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అపరాజిత జలాభిషేకంతో శివానుగ్రహం లభించి సకల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు’ అని సూచిస్తున్నారు.

News February 15, 2026

WGL: కార్యకర్తలు ఎవరు? కట్టప్పలు ఎవరు?

image

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార-ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. కొన్ని వార్డుల్లో అనూహ్య ఫలితాలు రావడంతో అంతర్గత విభేదాలు, అసంతృప్తి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పని చేయాల్సిన వారే ప్రత్యర్థులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమికి బాధ్యులెవరు అన్న దానిపై నేతలు సమీక్షలు చేపడుతున్నారు.