News September 11, 2025

వరంగల్: తెల్ల కాగితం.. పట్టా రూపం..!

image

తెల్ల కాగితంపై భూమి కొనుగోలు చేసిన రైతులకు పట్టా రూపంగా పాసుబుక్ ఇచ్చేందుకు మార్గం సుగుమమైంది. తాజాగా భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ద్వారా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12-10-2020 నుంచి 10-11-2020 మధ్య అనధికార భూలావాదేవీలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించాలని సూచించింది. ఉమ్మడి WGL జిల్లాలో 1,79,697 సాదాబైనామా దరఖాస్తులు రాగా కొంత మందికి మేలు జరగనుంది.

Similar News

News April 14, 2026

పెద్దపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో శ్రీధర్ బాబు

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన డా. బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనే తమ లక్ష్యమని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు విజయరమణారావు, నాయకులు పాల్గొన్నారు.

News April 14, 2026

మెదక్: వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడదెబ్బ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు.

News April 14, 2026

PDPL: అంబేడ్కర్, శ్రీపాదరావు, వెంకటస్వామికి ఘన నివాళి

image

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మంథనిలో డి.శ్రీపాదరావు విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాను నిన్న ఢిల్లీలో ఉండటంతో స్వర్గీయ డి. శ్రీపాదరావు వర్ధంతికి రాలేకపోయానన్నారు. కాకా వెంకటస్వామి, అంబేడ్కర్ విగ్రహాల వద్ద కూడా నివాళులు ఘటించారు. అంబేడ్కర్ ఆశయాలు ఆచరించాలని పిలుపునిచ్చారు. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ కార్మికులు ఆయనను కలవగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.