News November 27, 2025
వరంగల్: తొలి విడతలో 555 పంచాయతీలకు నామినేషన్లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత నామినేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో భాగంలో 23 మండలాల్లోని 555 గ్రామ పంచాయతీలకు, 4952 వార్డులకు నామినేషన్లు వేయనున్నాను. అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయడానికి 171 కేంద్రాలను జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగులో 15, హనుమకొండలో 24, వరంగల్‌లో 29, జనగామలో 30, భూపాలపల్లిలో 24, మహబూబాబాద్‌లో 49 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Similar News
News November 27, 2025
సేమ్ ప్రపోజల్: ఇప్పుడు స్మృతి.. అప్పట్లో బీర్వా షా..

స్మృతి మంధానతో వివాహం ఆగిపోవడంతో మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో పలాశ్ పాత ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అతడు స్మృతిని స్టేడియంలోకి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశారు. 2017లో అచ్చం ఇలాగే మాజీ ప్రియురాలు బీర్వా షాకు కూడా ప్రపోజ్ చేసిన ఫొటోలు బయటికొచ్చాయి. ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలనుకున్న తరుణంలో 2019లో వీరిద్దరూ అనూహ్యంగా విడిపోయారు. ఇప్పుడు స్మృతి-పలాశ్ పెళ్లిపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
News November 27, 2025
సూర్యాపేట: 94,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 346 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 94,698 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వి.మోహనా బాబు Way2Newsకు తెలిపారు. రైతుల నుంచి 41,626 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 53,071 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 6,451 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యానికి రూ.3.22 కోట్లు బోనస్ చెల్లించినట్లు ఆయన తెలిపారు.
News November 27, 2025
పల్నాడు: అంబటి చూపు ఎటువైపు..?

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు రానున్న ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె, సత్తెనపల్లి నుంచి మూడుసార్లు పోటీ చేసి ఒక్కసారి గెలిచారు. మాజీ సీఎంలు వైఎస్సార్, జగన్‌కు సన్నిహితుడైన ఆయన ప్రస్తుతం వైసీపీ గుంటూరు వెస్ట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.


