News February 28, 2025
వరంగల్: దశాబ్ద కాలం కోరిక నెరవేరింది: మంత్రి సురేఖ

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నెరవేరిందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది సీఎం రేవంత్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందన్నారు.
Similar News
News March 1, 2025
మాజీ సీఎం కేసీఆర్‌కు పెండ్లి ఆహ్వాన పత్రిక

మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులకు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం తన మనవడి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. పెండ్లికి సకుటుంబ సమేతంగా రావాలని కేసిఆర్‌ను ఈ సందర్భంగా ఆయన కోరారు. పెండ్లికి తప్పకుండా వస్తానని మాజీ ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు.
News March 1, 2025
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పై 25% రాయితీ: జిల్లా కలెక్టర్

శుక్రవారం సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 31వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు.
News March 1, 2025
ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.