News July 25, 2024

వరంగల్: దారుణంగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర భారీగా పతనమైంది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పత్తి ఈరోజు భారీగా పడి పోయింది. సోమవారం రూ.7,150 పలికిన క్వింటా పత్తి మంగళవారం రూ.7,180, బుధవారం రూ.7,230 అయింది. ఈ క్రమంలో నేడు దారుణంగా పతనమై రూ.7,025కి చేరింది. దీంతో మార్కెట్‌కు పత్తి తీసుకుని వచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

Similar News

News July 5, 2025

వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

image

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 4, 2025

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

image

ఎరువుల షాపుల డీలర్లు, యజమానులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామాల్లో ఉన్న ఎరువుల షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

News May 7, 2025

కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేశారు. యూనివర్సిటీ పరిధిలోని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పరీక్ష ఫీజులు చెల్లించని కారణంగా డిగ్రీ(రెగ్యులర్) 2వ, 4వ, 6వ, డిగ్రీ (బ్యాక్ లాగ్) మొదటి, 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను మరోసారి ప్రకటిస్తామని పేర్కొన్నారు.